
సిద్దిపేట రూరల్, వెలుగు: జాతీయ మెగా లోక్ అదాలత్ లో 3073 కేసుల పరిష్కారమైనట్లు సీపీ అనురాధ శనివారం తెలిపారు. వివిధ పీఎస్పరిధిలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ తో పాటు, కోర్టు విచారణలో ఉన్న 307 కేసులు, డ్రంకన్‌డ్రైవ్, ఎంవీ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి 2747 కేసులు, 19 పెట్టి కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది 15 రోజుల నుంచి కక్షిదారులను కలిసి అవగాహన కల్పించడం వల్లే టార్గెట్ కు మించి కేసులు పరిష్కారమయ్యాయన్నారు.